రాయపోల్ జనవరి 09 : విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పది పరీక్షల్లో 100% ఉత్తీర్ణత కావాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని బేగంపేట ఉన్నత పాఠశాల బేగంపేట్ ను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులు బాగా చదివి మండలానికి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ఆయన సూచించారు. ఉన్నతమైనభవిష్యత్తు కేవలం చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అనంతరం ప్రాథమిక పాఠశాల బేగంపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు ఫెస్టివల్ గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపా ధ్యా యులు ప్రమీల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు సంజీవ్, నవీన్ కుమార్, రాములు గౌడ్, దివాకర్, నరసింహులు గౌడ్, అమరేందర్ గౌడ్, కమలాకర్ ,రాజేందర్ ప్రసాద్, వసంత, పావని, కిరణ్ కుమార్, సి ఆర్ పి యాదగిరి పాల్గొన్నారు.