Masa Kalyanotsavam | దౌల్తాబాద్, అక్టోబర్ 11: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోశ్ఛరణాల మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు.
స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడంతోపాటు పల్లకి సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలను ఆలయ పూజారి వెంకటేశం నిర్వహించారు.
కళ్యాణోత్సవంలో సునీత, సురేష్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Robbery | లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్నారు.. కానీ మార్గమధ్యలోనే ఆపి..
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర
Rangareddy | 250 గజాల ఇంటి స్థలం కోసం వివాదం.. బాబాయిపై కుమారుడి కత్తి దాడి