– వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్
తొగుట, జనవరి 30 : గాంధీజీ అహింస, సత్యం, త్యాగం అనే మార్గాలతో భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి స్ఫూర్తిగా నిలిచారని తోగుట మండలంలోని వెంకట్రావుపేట సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ అన్నారు. మహాత్మాగాంధీ వర్దంతి సందర్బంగా వెంకట్రావుపేటలోని గ్రామ పంచాయతీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు లేకుండా పోరాడి విజయం సాధించిన మహానుభావుడు గాంధీ అన్నారు. ఆయన జీవితం మనకు నైతిక విలువలు, సహనం, శాంతి ఎంత ముఖ్యమో నేర్పుతుందన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. అనంతరం జరిగిన గ్రామ సభలో గ్రామ సమస్యల గురుంచి చర్చించారు. విడతల వారీగా సమస్యలను పరిష్కరిస్తానని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ సాయి కుమార్, యూ పి ఎస్ హెచ్ ఎం వెంకటయ్య, ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, కార్యదర్శి రవీందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.