Nano Urea | రాయపోల్, జులై 22 : నానో యూరియా వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునని మండల ప్రత్యేక అధికారి, గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ బాబు నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయోజనాలు, వినియోగించే విధానాలను వివరించారు.
1. ప్రయోజనాలు:
* నైట్రోజన్ వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.
* మొక్కల పెరుగుదల, ధారాళమైన దిగుబడి, మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది.
* సాధారణ యూరియాపై ఆధారాన్ని తగ్గించి, వ్యయాన్ని తగ్గిస్తుంది.
* పర్యావరణహితం – నైట్రోజన్ లీచింగ్ తగ్గి మట్టి మరియు నీటి కాలుష్యం తగ్గుతుంది.
2. వినియోగ విధానం:
* ప్రధాన పంట దశల్లో వాడితే మెరుగైన ఫలితాలు అందుతాయి (ఉదాహరణకు: తొలకరి, పుష్పించు దశ).
* మోతాదు: 1 లీటర్ నీటికి 2 నుంచి 4 మిల్లీ లీటర్లు స్ప్రే చేయాలి.
* ప్రతి పంట కాలంలో 2 సార్లు ఉపయోగించడం ఉత్తమం.
3. అనుకూల పంటలు:
* వరి, గోధుమ, పత్తి, మక్కజొన్న, కూరగాయలు, పప్పుదినుసులు, మరియు నూనె గింజల పంటలు.
4. అదనపు సమాచారం:
500 మిల్లీ బాటిల్ రూపంలో అందుబాటులో ఉంది – ఇది ఒక యూరియా బస్తాకు సమానమన్నారు.
వ్యవసాయ రంగం నుండి వచ్చే హరిత గృహ వాయువుల ఉద్గారాలు తగ్గించడంలో సహాయపడుతుందని ఏడిఏ బాబు నాయక్ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇఫ్కో ప్రతినిధి చంద్రబాబు రైతులు పాల్గొన్నారు.
Kanwar Yatra: కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లు లైసెన్సులు డిస్ప్లే చేయాలి: సుప్రీంకోర్టు
TTD key decisions | టీటీడీ కీలక నిర్ణయాలు.. సైబర్ క్రైమ్ లాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Crime news | అత్యాచారం చేశాడంటూ డెలివరీ బాయ్‌పై మహిళా టెక్కీ తప్పుడు ఫిర్యాదు.. తర్వాత ఏమైందంటే..!