Main Road | తొగుట, ఆగస్టు 09 : ఇక్కడ లారీ దిగబడ్డది.. అయితే ఇది ఎక్కడో మారుమూల మట్టి రోడ్లో కాదు.. తొగుట- సిద్దిపేట ప్రధాన రోడ్డులో.. మెట్టులోని దుబ్బాక ప్రధాన కాలువ పక్కన ఉన్న రోడ్డు దుస్థితి ఇది. దుబ్బాక కాలువపై బ్రిడ్జి వేసినప్పటికీ బీటీ రోడ్డు వేయకపోవడంతో మట్టి రోడ్డు గుంతల మయంగా మారింది. వర్షం కురిస్తే గుంతల గుండా వెళ్తే ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్లు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోడ్డు అద్వానంగా మారింది.
రోడ్డులో కంకర వేయాల్సి ఉండగా మట్టి వేశారు. దీంతో ఈ మట్టి రోడ్డు వర్షాలకు బురుద రోడ్డుగా మారిపోయింది. ఈ రోడ్డున వెళ్తున్న ఆటోలు, బైకులు, లారీలు, కార్లు అన్ని దిగబడిపోతున్నాయి. ఈ రోజు ఉదయం అటుగా వెళ్లిన లారీ దిగబడగా.. దాన్ని బయటకు తీసుకురావడానికి ట్రాక్టర్ జేసీబీ సహాయంతో బయటకు లాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఎందుకు వొచ్చామురా ఈ దారిలో అని వారు తలలు పట్టుకుంటున్నారు. ఈ రోడ్డు వెంట రోజు మండలాధికారులు, జిల్లా అధికారులు వెళ్తున్నా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటే ఈ మట్టి రోడ్డులా ఉన్నట్లు ఉందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.
Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్.. వీడియో