Pedda Arepally : లయన్స్ క్లబ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని పెద్ద ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలకు మైక్ సౌండ్ పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా లైయన్స్ క్లబ్ స్నేహ గజ్వేల్ అధ్యక్షులు మల్లేశం గౌడ్, ట్రెజరీ సత్యనారాయణలు మాట్లాడుతూ… సంస్కృత కార్యక్రమాలకు, పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడేలా పాఠశాలకు మైక్ సెట్‌ను అందజేశామని తెలిపారు. మైక్ సెట్ విలువ సుమారుగా రూ. 7,500 రూపాయలు ఉంటుందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల లో మెరుగైన ఫలితాలు రావడం పట్ల సంతోషంగా ఉందని మల్లేశం గౌడ్ అన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి పురోగతి సాధించాలని అన్నారు. భవిష్యత్తులో కూడా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలలకు లయన్స్ క్లబ్ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ చంద్రశేఖర్,ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.