Dalitha Bandhu | తొగుట, జనవరి 31 : తొగుట మండలంలోని తుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 9న జరగబోయే ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా సదస్సును విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు లింగాల కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
గత మూడు దశాబ్దాలుగా దళితుల అభివృద్ధి, మాదిగల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు తొగుట మండల కేంద్రంలో మండల నూతన అధ్యక్షుడిగా ఆకారం కిషన్ మాదిగను నియమించారు.
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు లింగాల కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. సామాజికంగా వెలివేయబడిన దళితుల అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించాలి. అంతేకాకుండా దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా సదస్సు విజయవంతం కావాలంటే ప్రతి గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధిని రాజమలయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకట్, రాష్ట్ర, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలిగరి కృష్ణ, జిల్లా కార్యదర్శి కాసర్ల నర్సింలు, జిల్లా అధికార ప్రతినిధి లింగాల స్వామి, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ లింగాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Sangareddy | రేపే పశువుల జాతర.. 359 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం గురించి తెలుసా!
Harish Rao | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం : మాజీ మంత్రి హరీష్ రావు