Leopard | దౌల్తాబాద్, నవంబర్ 10 : గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో పొదల్లో చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేసింది. గొడుగుపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద పశువులను మేపడానికి వెళ్తున్న క్రమంలో చిరుత పులి పశువులపైకి దాడి చేసే ప్రయత్నం చేసిందని.. భయంతో కేకలు వేయడంతో పరిగెత్తిందన్నారు.
సెల్ఫోన్ లేకపోవడంతో పక్కనే ఉన్న జత్రం తండా రైతులు రాములు, చందర్, శ్రీకాంత్ వద్దకు వెళ్లి చిరుత పులి ఉందని తెలపగా వారు వచ్చి చూడగా ఓ పొదల్లో ఉంది. వెంటనే చిరుత పులి ఉన్న సమాచారాన్ని వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. దుబ్బాక రేంజ్ అధికారి సందీప్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ హైమద్, బీట్ ఆఫీసర్ వేణు అటవీ ప్రాంతానికి వెళ్లి చూశారు. చిరుతపులి పొదల్లో పడుకొని ఉన్నట్లు గుర్తించారు.
కదలలేని పరిస్థితిలో..
ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. చిరుత పులి కదలలేని పరిస్థితిలో ఉందని ప్రస్తుతం నీళ్లు, ఆహారం రెండు రోజుల వరకు అవసరం లేదని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చిరుత సమాచారాన్ని హైదరాబాద్ స్పెషల్ టీంకు సమాచారం అందించామని, టీం తెలిపిన వివరాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. వెటర్నరీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని తెలిపారు. రైతులు ఆ చుట్టుపక్కల పొలాల వద్దకు వెళ్ళవద్దని సూచించారు.


Collector Koya Sriharsha | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష