Steel bank | హుస్నాబాద్ టౌన్, జులై 3 : లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకు పరిస్థితి ఇది. రూపాయి రూపాయి జమచేసిన మహిళల డబ్బులతో స్టీల్బ్యాంకును హుస్నాబాద్ మున్సిపాలిటి ఏర్పాటు చేసింది. నిత్యం ఈ స్టీల్ బ్యాంకును తెరిచి అవసరమైన వారికి స్టీల్ వస్తువులను కిరాయికి ఇవ్వాల్సి ఉండగా ఇలా తాళం వేసి నిర్వహణను గాలికి వదిలేశారు.
అలాగే ఇండ్లలో ఉపయోగంలేని వస్తువులను సైతం ట్రిపుల్ ఆర్ కేంద్రంకు ఇచ్చేందుకుగాను మరో కేంద్రాన్ని సైతం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు. కానీ ఈ ట్రిపుల్ ఆర్ కేంద్రంను సైతం ఇలా మూసివేసి అవసరం లేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మరి తాళాలు తీసి వినియోగంలోకి తెస్తారో ఎందుకులే అని వదిలేస్తారో వేచి చూడాల్సిందే మరి.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్