హుస్నాబాద్: బస్సు ఎక్కి కూర్చున్న ఓ వృద్ధుడు సీటులోనే ఒరిగి మృతి చెందిన ఘటన బుధవారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగింది. వివరా ల్లోకి వెళితే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లికి చెందిన చేనేత కార్మికుడు ఇప్పకాయల రాజేశం(75) చేనేత కార్మికుడిగా చాలా సంవత్సరాలు పని చేశాడు. ప్రస్తుతం నేత పని సాధ్యం కాకపోవడంతో హోల్‌సేల్ దుకాణాల్లో బట్టలు కొనుగోలు చేసి తన గ్రామంలో ఇంటింటికీ తిరిగి అమ్ముకునేవాడు. ఈ నేప థ్యంలో రాజేశం బుధవారం బట్టలు కొనేందుకు హుస్నాబాద్‌కు వచ్చి తిరిగి ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్తుండగా
కూర్చున్న సీటులోనే మృతి చెందాడు. ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసు సిబ్బంది వచ్చి విచారణ జరిపారు. 108 సిబ్బంది వైద్య పరీక్షలు చేసి మృతి చెంది నట్లుగా నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని రాజేశం సొంత గ్రామం రసూల్పల్లెకు తరలించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. నిరుపేద అయిన రాజేశం బస్సులోనే గుండెపోటుతో మృతి చెందడం అక్కడి ప్రయాణికులకు, గ్రామస్థులకు విషాదాన్ని నింపింది.