Komuravelli Temple | చేర్యాల, మార్చి 27 : తనతో కొందరు దుర్భాషలాడారని, తనను సెల్‌ఫోన్‌తో కొట్టారని పోలీసులకు మల్లన్న ఆలయ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు బుధవారం రాత్రి 9.30గంటలకు ఆలయంలో విజయ్‌కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఆరెళ్ల మహేష్, ఎక్కలదేవి వినయ్ అనే వ్యక్తులు ఇతరులతోపాటు ఆలయ ప్రాంగణంలోకి వెనుక ద్వారం ద్వారా ప్రవేశించారని తెలిపారు.
దర్శనం కోసం ఆ మార్గంలో ప్రవేశించవద్దని విజయ్‌కుమార్ వారికి తెలియజేయడంతో ఆరెళ్ల మహేష్‌తోపాటు ఇతరులు అతనితో దుర్భాషలాడారని, సెల్‌ఫోన్‌తో కొట్టాడని.. ఈ ఘటనలో విజయ్‌కుమార్ ఎడమ చేతికి గాయమైందని దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇదిలా ఉండగా ఆలయంలో విజయ్‌కుమార్ రెగ్యులర్ ఉద్యోగిగా కొనసాగుతుండగా.. మహేష్ తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో ఆలయంలో ఏం జరుగుతుందోనని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!