చేర్యాల, సెప్టెంబర్ 3 : ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ది శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం స్వామి వారికి మహా నివేదన అనంతరం 1గంటకు మల్లన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు. తిరిగి 8వ తేదీన ఆలయంలో సంప్రోక్షణ అనంతరం పూజలు నిర్వహించి 6గంటల నుంచి భక్తులకు దర్శనం, ఆర్జీత సేవలు యదావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి ముసలం.. సిద్ధరామయ్య, డీకే వర్గీయుల మాటల యుద్ధం
Train Reverse | జారిపడిన ప్రయాణికుడి కోసం వెనక్కి వెళ్లిన రైలు.. అయినా దక్కని ప్రాణం!
OpenAI | చాట్‌జీపీటీలో కీలక మార్పులు చేస్తున్న ఓపెన్ఏఐ.. కొత్తగా పేరెంటింగ్ కంట్రోల్ ఫీచర్!