Komuravelli Brahmotsavalu | చేర్యాల, మార్చి 24 : తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ ఆలయాల్లో ఒక్కటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు చివరి ఆదివారం సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంతో ముగిసాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొమురవెల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పలు ఆలయాల్లో కేవలం వారం రోజుల్లో ముగిసే ఉత్సవాలు ఇక్కడ మాత్రం మూడు మాసాలపాటు సుదీర్ఘంగా సాగడం విశేషం. 10 ఆదివారాలపాటు నిర్వహించిన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సంవత్సరం జనవరి మాసం రెండవ ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవంతో ప్రారంభమైన ఉత్సవాలు, సంక్రాంతి అనంతరం వచ్చిన మొదటి ఆదివారం నుండి 10వారాల పాటు అత్యంత వైభవంగా సాగాయి. స్వామి వారి కల్యాణం, పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బుకింగ్, హుండీ ఆదాయం రికార్డు స్ధాయిలో పెరిగింది.
అంతేకాకుండా వీఐపీల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వామి వారి కల్యాణోత్సవానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ,ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు హాజరై పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డి, గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డిలతోపాటు పలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పలు జిల్లా కోర్టులకు చెందిన పలువురు న్యాయమూర్తులు, అధికారులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చారు.
ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లతోపాటు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన భక్తులతోపాటు మహారాష్ట్ర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల నుండి ప్రజలు కొమురవెల్లికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఆలయ ఈవో కే రామాంజనేయులు, ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది శ్రమించారు.హుస్నాబాద్ ఏసీపీ సతీశ్,చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజుతో పాటు జిల్లాలోని పలువురు సీఐ, ఎస్సైలు, పీసీలు భక్తులకు ఇబ్బందుకు రాకుండా బందోబస్తు నిర్వహించారు.
Students Suspended | సీనియర్‌ను కొట్టిన జూనియర్ స్టూడెంట్స్.. 13 మంది సస్పెండ్
జీనోమ్ వ్యాలీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ర్యాపిడో డ్రైవర్ దుర్మరణం
Devara Part 1 | దేవర ప్రమోషన్స్ టైం.. జపాన్‌లో తారక్, కొరటాల శివ బిజీబిజీ
OTT Movies| ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడే సందడి.. ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..!