OTT Movies| ప్రతి వారం కూడా ఇటు థియేటర్స్ అటు ఓటీటీలో మంచి సందడి నెలకొని ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాలు, యావరేజ్‌గా నిలిచిన సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చి సినీ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అయితే ఇది మార్చి చివరి వారం కాగా, పలు సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయబోతున్నాయి. ముందుగా అవేంటని చూస్తే.. ఎమోషన్, పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్నిరకాల అంశాలుతో అలరించడానికి వస్తున్న చిత్రం ‘ఎల్ 2 : ఎంపురాన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో రూపొందిందిన ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు చియాన్ విక్రమ్ హీరోగా రూపొందిన యాక్షన్ సినిమా ‘వీర ధీర శూర’. ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.
టాలీవుడ్ హీరో నితిన్ ‘రాబిన్‌హుడ్’తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీ మార్చి 28 విడుదల కానుంది. మ్యాడ్’ మూవీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు కల్యాణ్ శంకర్. ఇప్పుడు ఆయన ‘మ్యాడ్ స్క్వేర్’తో ప్రేక్షకులని అలరించేందుకు వస్తున్నారు.ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సికందర్ కాగా, ఈ మూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే..ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లో మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అలానే అమెజాన్ ప్రైమ్ లో హాలెండ్ (ఇంగ్లీష్) – మార్చి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆదిపినిశెట్టి హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ శబ్ధం మార్చి 28న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక జియో హాట్‌స్టార్‌లో ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) – మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఓం కాళి జై కాళి మార్చి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5లో విడుదల పార్ట్-2 (హిందీ) మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలానే సందీప్ కిషన్ హీరోగా రూపొందిన మజాకా చిత్రం మార్చి 28 నుండి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహా లో ది ఎక్స్టార్డనరీ జర్నీఆఫ్ ది ఫకీర్ (తెలుగు) మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.