Devara Part 1 | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటించిన చిత్రం దేవర (Devara). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుండగా.. గతేడాది దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇక తారక్ జపాన్‌లో కూడా తన మేనియా చూపించేందుకు దేవర పార్టు 1తో అక్కడ సందడి చేయబోతున్నాడు.
దేవర పార్టు 1 మార్చి 28న జపాన్‌లో విడుదల కానుండగా.. అక్కడి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ఈ నేపథ్యంలో తారక్ అండ్ కొరటాల శివ టీం ఇప్పటికే జపాన్‌లో ల్యాండ్ అయింది. ప్రమోషన్స్‌లో భాగంగా తారక్, కొరటాల శివ ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. అక్కడి మీడియాతో తారక్, కొరటాల ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. ఇది జాన్వీకపూర్‌కు డెబ్యూ ప్రాజెక్ట్.
దేవరకు పాపులర్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Japanese media interviews have begun with #Devara and the Director.#デーヴァラ @tarak9999 #KoratalaSiva @devaramovie_jp pic.twitter.com/CF8YZ11iji
— Devara (@DevaraMovie) March 24, 2025