Dia Mirza | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. సుశాంత్ మరణం వెనుక రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఉందని మీడియాలో సైతం వరుస కథనాలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ కేసులో రియా ప్రమేయం లేదని సీబీఐ (CBI) తేల్చింది. ఈ మేరకు రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చింది. తీర్పు అనంతరం రియా చక్రవర్తికి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. పలువురు నెటిజన్లు, ప్రముఖులు రియాకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నటి దియా మీర్జా (Dia Mirza) సైతం మీడియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణంపై అప్పట్లో రియా చక్రవర్తిని దోషిగా చూసే ప్రయత్నం జరిగిందన్నారు. రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే కోణంలో మీడియా సైతం వరుస కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. ఆ ప్రచారంతో రియా కుటుంబం అవమానాల పాలైందన్నారు. అయితే, రాజ్‌పుత్ మరణం వెను కెలాంటి కుట్ర లేదని సీబీఐ తేల్చిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆమెను నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేసినందుకు రియా, ఆమె కుటుంబానికి మీడియా క్షమాపణలు చెప్పాలని దియా మీర్జా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మీడియా కథనాలే కాక, కొన్ని రాజకీయ ప్రయోజనాలు కూడా రియాను బలికొన్నాయని విమర్శించారు.
సుశాంత్ కేసులో క్లీన్ చిట్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఊహించని విధంగా ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 14 జూన్ 2020న బాంద్రాలోని తన ఇంట్లో చనిపోయాడు. అయితే మొదట్లో ఈ కేసు ఆత్మహత్యగా భావించిle, ఆ తరువాత వచ్చిన ఆరోపణలతో దీనిపై ప్రభుత్వం కూడా సీబీఐతో దర్యాప్తు చేయించింది. ముంబైలోని తన నివాసంలో మృతి చెందిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టుకు క్లోజర్ నివేదిక సమర్పించడంతో వారు ఫైనల్‌గా దీనిని ఆత్మహత్య అని తేల్చారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, దొంగతనం వంటి ఆరోపణలపై ఈ కేసు దర్యాప్తు సాగించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకి ఆమోదం తెలపడంతో సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయాలని 19 ఆగస్టు 2020న ఆదేశించింది.
ఇక ఈ కేసును సుసైడ్ కేసుగా పోలీసులు భావించినప్పటికీ సుశాంత్ తల్లిదండ్రులు మాత్రం అది ఆత్మహత్యకాదంటూ రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీపై కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపించడంతో ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు భావించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రియాను ప్రశ్నించింది. ఆ తర్వాత, కేసును సీబీఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సుశాంత్‌కు రియా మాదకద్రవ్యాలు ఇచ్చారనేది మరో ఆరోపణ. ఇలా నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తుది తీర్పును వెలువరించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అతనే ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరూ అతన్ని చనిపోయేలా బలవంతం చేయలేదని తేల్చింది. అలానే రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చింది సీబీఐ. ఇందులో ఎటువంటి నేర కోణం లేదా కుట్ర గాని జరగలేదు. సోషల్ మీడియా చాట్లను దర్యాప్తు కోసం అమెరికాకు పంపించగా, అక్కడ కూడా ట్యాంపరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏం లభించలేదు. అంటూ తీర్పును వెలువరించింది.
Also Read..
“రియా చక్రవర్తి బ్యాంక్ ఖాతాల డీఫ్రీజ్, గాడ్జెట్లు అందజేత”
“Rhea Chakraborty | సుశాంత్ సింగ్ రాజ్పుత్ని చాలా మిస్ అవుతున్నా.. రియా చక్రవర్తి ఎమోషనల్”
“Rhea Chakraborty | జైలులో డ్యాన్స్ చేశా”