Rhea Chakraborty – Sushanth Singh Rajputh | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సుసైడ్ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి భారీ ఊరటా లభించింది. ఈ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చీట్‌ను అందించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఊహించని విధంగా ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 14 జూన్ 2020న బాంద్రాలోని తన ఇంట్లో చనిపోయాడు. అయితే ఈ కేసును సుసైడ్ కేసుగా పోలీసులు భావించిన కూడా సుశాంత్ తల్లిదండ్రులు అది ఆత్మహత్యకాదంటూ రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీపై.. కేసు పెట్టారు.
సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపించడంతో ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు భావించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రియాను ప్రశ్నించింది. ఆ తర్వాత, కేసును సీబీఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సుశాంత్‌కు రియా మాదకద్రవ్యాలు ఇచ్చారనేది మరో ఆరోపణ. ఇలా నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తుది తీర్పును వెలువరించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అతనే ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరూ అతన్ని చనిపోయేలా బలవంతం చేయలేదు అని తెలిపింది. అలానే రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చింది సీబీఐ. ఇందులో ఎటువంటి నేర కోణం లేదా కుట్ర గాని జరగలేదు. సోషల్ మీడియా చాట్లను దర్యాప్తు కోసం అమెరికాకు పంపించగా, అక్కడ కూడా ట్యాంపరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏం లభించలేదు. అంటూ తీర్పును వెలువరించింది.
అయితే తీర్పు అనంతరం రియా చక్రవర్తికి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుంది. నేరం రుజువుకాకముందే రియాను నేషనల్ మీడియా ఎలా నేరస్తురాలిగా చిత్రీకరించిందో నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేగాకుండా తనపై నెగిటివ్ ప్రచారం చేసి తన కెరీర్‌ని తన ఫ్యామిలీ పరువును నాశనం చేసినందుకు నెటిజన్లు రియాకు క్షమాపణలు తెలుపుతున్నారు. మరోవైపు మీడియా కూడా రియాకు క్షమాపణలు తెలపాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
We are sorry Rhea Chakraborty 🙏
Repeat after me. pic.twitter.com/X3VAGbhxee
— Mr. Democratic (@Mrdemocratic_) March 22, 2025
We, as a nation, owe an apology to you, Rhea Chakraborty
The CBI has closed the Sushant Singh Rajput case and given a clean chit to Rhea as no evidence was found against her
Will godi media apologize to her for destroying her career for the sake of cheap TRP?@Tweet2Rhea pic.twitter.com/0ehUZyejue
— Mohit Chauhan (@mohitlaws) March 22, 2025
Will Times Now, Republic and India Today apologise to Rhea Chakraborty post the CBI closure report and the clean chit to her? If they have any shame, any shred of human decency they should issue a grovelling apology for slandering her, telling outrageous lies, getting her…
— Rohini Singh (@rohini_sgh) March 22, 2025