Kids Athletics | సిద్దిపేట కమాన్, మే 19 : సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 8 గంటలకు సిద్దిపేటలోని స్టేడియంలో అండర్-8, 10,12 విభాగాల్లో బాలబాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గ్యాదరి పరమేశ్వర్, కర్రోళ్ల వెంకట స్వామిగౌడ్ తెలిపారు.
ఈ ఎంపిక పోటీల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేస్తామన్నారు. పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేయబడతాయన్నారు. పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వీరు జూన్ 1 న జింఖాన గ్రౌండ్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 27న సాయంత్రంలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. పూర్తి వివరాలకు 8501977079, 9704061543 నంబర్లలో సంప్రదించాలన్నారు.