Drugs | రాయపోల్, జూన్ 25 : యేటా 26 వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం రాయపోల్ మండలంలోని రాంసాగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదనంతర పరిణామాల గురించి రాయపోల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్సై రఘుపతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై రఘుపతి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్ పట్ల ఆకర్షితులవుతూ శారీరకంగా అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో మానసికంగా మార్పులు జరిగి విచక్షణ కోల్పోయి దొంగతనం,మర్డర్, హత్యాచారం, ఇతరులపై దాడికి దిగటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జైలు పాలు అవుతున్నారు. అటువంటి వ్యక్తులు కుటుంబానికి సమాజానికి అత్యంత ప్రమాదకరం. కావున రాబోవు తరం చెడు వ్యసనాల బారిన పడి సమాజానికి కంటకాలుగా తయారు కాకూడదంటే విద్యార్థి దశ నుండే మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండటం అత్యవసరం అని తెలిపారు.
అంతేకాకుండా కల్తీ కల్లు, గంజాయి వంటివి వాడకం సమాజంలో విరివిగా ఉన్న నేపథ్యంలో పిల్లలు తమ చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులలో ఎవరికైనా పైన తెలిపిన చెడు అలవాట్లు ఉంటే వాటి వలన ఎదుర్కొనే పరిణామాలను వివరిస్తూ వారిని వ్యసనాల నుండి దూరం చేసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి మరే ఇతర మాదకద్రవ్యాలైన సేవించేవారు ఉంటే వారి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేసి తెలపాలని.. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని వివరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులతో రాయపోల్ ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ