Farmers | రాయపోల్, మే 27 : రైతులకు అందుబాటులో జిలుగ విత్తనాలు ఆగ్రోస్ కేంద్రాలకు రావడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు. 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు రాయపోల్ మండల పరిధిలోని ఆగ్రో రైతు సేవ కేంద్రాలకు 50 క్వింటాళ్ల జిలుగు విత్తనాలు, 20 క్వింటాళ్ల జనుము విత్తనాలు మొదటి విడతగా రావటం జరిగిందన్నారు.
రైతు జనుము 40 కేజీల సంచి సబ్సిడీ పోను రూ.2,510 చెల్లించాలి. జిలుగు 30 కేజీల సంచికి సబ్సిడీ పోను రూ.2,137.50 చెల్లించాలన్నారు. జనుము, జిలుగ కావాల్సిన రైతులు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ప్రతీ రైతుఆధార్ కార్డ్ జిరాక్స్‌లతో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఆన్లైన్లో పర్మిట్ నెంబర్ తీసుకొని రాయపోల్ ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు వచ్చి తీసుకోవాలని సూచించారు.
మండలంలో మొత్తం 150 కింటాళ్ల జిలుగు విత్తనాలు రావాల్సి ఉండగా మొదటి విడుదతగా 50 క్వింటాళ్ల జిలుగు విత్తనాలు రావడం జరిగిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు.