BRS Party | తొగుట, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి కోరారు. దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 9 గంటలకు గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఘనంగా ఎగురవేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణను సాధించుకోవడంతోపాటు అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో నిలిపడం జరిగిందన్నారు.. ‘ఉద్యమం నుంచి పుట్టిన పార్టీకి ప్రజలే బలం.. ప్రజలే భవిష్యత్తు’ బీఆర్ఎస్ పార్టీ 26 ఏళ్ల సేవలను స్మరించుకుంటూ, భవిష్యత్తులో మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలని జీడిపల్లి రాంరెడ్డి ఆకాంక్షించారు.