ఖైరతాబాద్, ఆగస్టు 13: ఆలేరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ కులానికి అన్యాయం, ద్రోహం చేస్తున్నారని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు దొడ్డి శ్రీనాథ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుమల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధి ఆ వర్గం ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
2024లో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ కమిషనర్ కు బీర్ల ఐలయ్య రాసినట్టు పేర్కొన్న లేఖ లో ప్రస్తుతం బీసీ-బీ క్యాటగిరీలో ఉన్న కురుమలను బీసీ-డీలో యాదవులతో కలుపాలని కోరినట్టు చెప్పారు. కురుమలను బీసీ ఏ కేటగిరీలోకి మార్చాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న సమయంలో ఇలాంటి లేఖ రాయడం దారుణమని మం డిపడ్డారు. లేఖ రాసిన విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశా రు. లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామన్నారు.