Rayapole ZPHS | రాయపోల్, మార్చి 04 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ పీఎం శ్రీ స్కూల్స్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ‘ఇంటరాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్’నిర్వహించారు. ఇందులో భాగంగా కాలిఫోర్నియా స్కాలర్ కొంగరి నర్సింహులు రాయపోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ‘నిత్యజీవితంలో రసాయన శాస్త్రం పాత్ర–ఉపయోగాలు’అనే అంశంపై ఆయన అవగాహన కల్పించారు. దైనందిన జీవితంలో రసాయన శాస్త్రం ప్రాధాన్యం, పరిశోధనల అవసరం, భవిష్యత్ అవకాశాలపై వివరించి విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. దౌల్తాబాద్ మండలం ముబారాస్ పూర్ గ్రామానికి చెందిన నర్సింహులు జడ్పీహెచ్ఎస్ రాయపోల్ 1990 సంవత్సరంలో పదో తరగతి బ్యాచ్‌కు చెందిన వారని, తమ పాఠశాల పూర్వ విద్యార్థి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటేశ్వర్లు తెలిపారు.
నరసింహులు మంచిగా చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నప్పటికీ తనకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను మరువకుండా ఆయన సందర్శించి పాఠశాలకు సహకారం అందించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. నేటి విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు