108 Ambulance | రాయపోల్, జులై 30 : దౌల్తాబాద్ మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తున్న 108 వాహనాన్ని రాష్ట్ర నాణ్యత విభాగ శాఖ తనిఖీ అధికారి కిషోర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ జాన్ షాహిద్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో గల అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్, పలు రికార్డులను పరిశీలించారు.
స్టాఫ్‌ను పలు విషయాలు అడిగి తెలుసుకున్న అధికారులు 108 సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సిబ్బందికి ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ హరి రామకృష్ణ, ఈఎంటి దేవేందర్, పైలెట్ నర్సింలు పాల్గొన్నారు.
Madhira : బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : చిత్తారు నాగేశ్వర్రావు