Health safety Awareness | వర్గల్, ఏప్రిల్16 : సంపూర్ణమైన ఆరోగ్య జీవితానికి ప్రతీ ఒక్కరూ యోగాసనాలు పాటించాలని వర్గల్ మండలం జెబ్బాపూర్ మహిళా సమైఖ్య సంఘం కో ఆర్డినేటర్ నర్సింలు తెలిపారు. ఇవాళ జెబ్బాపూర్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహిళలు పొదుపుతోపాటు, ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని నర్సింలు సూచించారు. ఎంత డబ్బు ఉన్నా, అనారోగ్యంతో బాధపడటం నరకంతో సమానమన్నారు. ఉపాధి హామీ కూలీలు సరైన ఆహారం తీసుకుంటూనే రోజూ 10 నుండి 20 నిమిషాలపాటు వీలు చేసుకొని యోగా చేసుకోవాలని సూచనలు చేశారు.
యోగా ద్వారా మానసిక వత్తిడి తగ్గడమేకాకుండా, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నర్సింలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళాగ్రూపు సభ్యులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్