సిద్దిపేట,మే11: సిద్దిపేట అన్నదాన కార్యక్రమం గొప్పతనం ఎల్లలు దాటేలా చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేదార్ నాథ్ సేవా సమితి సభ్యులను, అందులో పాలు పంచుకున్న వారిని ఎమ్మెల్యే హరీశ్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ కేదార్ నాథ్ కు వచ్చే భక్తులకు మీరు చేసే అన్న దానం గొప్ప సేవా కార్యక్రమం అన్నారు.
ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా మంచు కొండల్లో మీరు చేస్తున్న సేవ ప్రశంస నీయమ న్నారు. పదిరోజుల పాటు కేదార్ నాథ్ లో అన్నదానం సేవలో భాగస్వామ్యం అయిన సభ్యులను అందులో పాలు పంచుకున్న వారిని సన్మానించారు. ఇది ఎప్పుడు కొనసాగాలని ఆకాంక్షించారు. అందుకు నా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్య్రకమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు ఉన్నారు.