చిన్నకోడూర్, జులై 18 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త మహదేవోజు విష్ణుమూర్తి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలోని విష్ణుమూర్తి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
విష్ణుమూర్తి భార్య కొద్ది నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఇటీవల విష్ణుమూర్తి కూడా మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న హరీశ్‌రావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. విష్ణుమూర్తి పిల్లలను అన్నివిధాల ఆదుకుంటానని భరోసానిచ్చారు. అలాగే ఇబ్రహీంనగర్‌లో సోషల్‌మీడియా కన్వీనర్ తండ్రి మరణించడంతో ఆ కుటుంబాన్ని కూడా హరీశ్‌రావు పరామర్శించారు.