Harish Rao |సిద్దిపేట, డిసెంబర్ 6 : సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తల్లి మనకు జన్మనిస్తే గురువు మనకు విజ్ఞానం ఇస్తారు. గురువు చెప్పింది పాటిస్తే భవిష్యత్‌లో గొప్పవాళ్లవుతారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులను మార్కులు తెచ్చే యంత్రాలుగా మారుస్తున్నాయి. చదువు ఎంత ముఖ్యమో.. శారీరక దారుఢ్యం అంతే ముఖ్యం. టీపీఎస్ఏ చదువుతోపాటు జీవిత పాఠాలు చెబుతుంది. గొప్పవాళ్లు కావాలంటే చిన్నతనం నుంచే గురువు, తల్లిదండ్రులు చెప్పింది క్రమశిక్షణగా వినాలన్నారు.
జీవితంలో గొప్పవాళ్లు కావాలంటే వాయిదాలు వేయవద్దు. రేపు చేయాల్సింది ఈ రోజు చేయాలన్నారు. పుస్తకాలు చదివిన వారు జీవితంలో చెడిపోరు. పుస్తకాలు చదివితే ప్రపంచాన్ని చదవవచ్చు. ఇతర దేశాల్లో చిన్నతనం నుండి పుస్తకాలు చదువుతారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టనివాడు కోటీశ్వరుడు అయినా మూర్ఖుడే. విద్యతోపాటు సామాజిక బాధ్యతను నేర్పాలి. విద్య ఉంటే వినయం వస్తుంది. సమాజంలో ఎలా ఉండాలని తెలుస్తుందన్నారు.
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్ ?