తొగుట మార్చి 14 : సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Prabhakar Reddy) సహకారంతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించామని సొసైటీ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. గతంలో మాజీ మంత్రి హరీశ్ రావు సహకారంతో బుస్సాపూర్ నుండి గుడికందుల వరకు బీటీ రోడ్డు నిర్మించుకున్నామన్నారు. గతంలో ఈ రోడ్డు అందుబాటులో లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
దీంతోపాటు గుడికందుల నుండి వరదరాజు పల్లి వెళ్లే బీటీ రోడ్డు రెన్యూవల్ కోసం 1.80 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గుడికందుల గ్రామంలో ఎమైనా పనులు మిగిలి ఉంటే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లయ్య, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ బైరాగౌడ్, మాజీ వార్డ్ సభ్యులు ప్రకాష్, లావణ్య, సంతోష, వెంకట్, రాములు, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.