hand writing | రాయపోల్, ఆగస్టు 07 : చేతిరాతే విద్యార్థి భవితకు చేయూతనిస్తుందని ప్రముఖ చేతిరాత నిపుణుడు ఎజాస్ అహ్మద్ అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం చేతిరాత గుండ్రంగా ఎలా రాయాలి అనే అంశంపై అవగాహన కల్పించారు.
పాఠశాల విద్యార్థి దశలో అందంగా రాయడం వలన నేర్పించడం ఎంత అవసరం ఉందన్నారు.
చేతిరాత మనిషి మనసును అదుపులో ఉంచుతుంది. నిర్మాణాత్మకంగా ఆలోచింపజేస్తుందని.. స్వయం క్రమశిక్షణను పెంపొందింపచేస్తుందని పేర్కొన్నారు. మనిషి అంతసందర్భానికి మనోజ్ఞమైన భాష్యం అది పాఠకుల హృదయాలు రంజింప చేస్తే సువర్ణ రసఝరీ అని ఒక కవి అన్నట్లు ఉపాధ్యాయులు అక్షర రమ్యతను చేజెక్కించుకొని విద్యార్థుల గుండె గరిసలో ఆణిముత్యాల సంపదను నింపి నిత్య విద్యకృషివలురు కావాలని ఆయన ఆకాంక్షించారు.
శ్రద్ధ, ఆసక్తి పట్టుదల ఉండే ఆచార్యులు దేనినైనా సాధించవచ్చు. తెలుగు, హిందీ, ఆంగ్లం మూడు భాషలపైన అందమైన చేతిరాతను విద్యార్థులకు ఎజాస్ అహ్మద్ స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దండియాల విమల, ఉపాధ్యాయులు రాజమండ్రి శ్రీరాములు, వేణుగోపాల్ రెడ్డి, యాదగిరి, జ్యోతిలక్ష్మి, సంపత్ చందు, రవి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
COtton Crop | పత్తిలో అంతర పంటల సాగుతో చీడ పీడల నివారణ : శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి
Harish Rao | రెండేండ్ల కాంగ్రెస్ పాలన ప్రజలను కష్టాల పాలు చేసింది : హరీశ్ రావు
BRS | కార్యకర్తలకు బీఆర్ఎస్ పాటీ అండగా ఉంటుంది : వల్లుంపల్లి కరుణాకర్