Husnabad : అక్కన్నపేట, జూన్ 8: మండలంలోని గౌరవెల్లి గ్రామానికి చెందిన బైరగొని రవి (Bairagoni Ravi) అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. తాటి చెట్టు (Toddy Tree)నుంచి కింద పడడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ మాదిరిగానే రవి ఊరు సమీపంలోని తాటివనంలో కల్లు తీసేందుకు చెట్టు ఎక్కాడు.
అయితే.. ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడిపోయాడు. దాంతో, అతడి నడము, కాళ్లు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. రవి కిందపడడం గమనించిన తోటి గీత కార్మికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, అతడిని చికిత్స నిమిత్తం దవఖానకు తీసుకెళ్లారు. నిరుపేద గీత కార్మికుడైన రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.