Good Behaviour | తొగుట ఆగస్టు 25 : తొగుట సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రౌడీలు, అనుమానితులపై ‘గుడ్ బిహేవియర్’ కార్యక్రమం నిర్వహించారు. తొగుట, బేగంపేట, దౌల్తాబాద్, కుకునూరు పల్లి, రాయపోల్ మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో గుర్తించబడిన రౌడీలు, అనుమానితులను పిలిపించి, భవిష్యత్తులో జరిగే వినాయక చవితి పండగ ఊరేగింపులో ఎలాంటి అక్రమాలు, అల్లర్లు, చట్ట విరుద్ధ కార్యక్రమాలలో పాల్గొనకూడదని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.
సమాజంలో సన్మార్గంలో నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమాజ శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి. నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా మళ్లీ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే, కఠినంగా వ్యవహరించడం జరుగుందని స్పష్టంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే లతీఫ్, తొగుట ఎస్ఐ రవికాంత్ రావు, దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, కుకునూర్ పల్లి ఎస్ఐ శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు కూడా తమ విధులకు సహకరించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు