సిద్దిపేట, అక్టోబర్ 1 : సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం కిష్టసాగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనుదీప్ తండ్రి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యక్తి గత సహాయకులు శేషు పెద్దనాన్న మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.
పట్టణంలోని షిర్డీ సాయి బాబా దేవాలయ ట్రస్ట్ మాజీ చైర్మన్ గందె శ్రీనివాస్ తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.