leopard | రాయపోల్, జూలై 06 : చిరుత పులి సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. బోరుబావుల వద్దకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో మరోసారి చిరుత పులి సంచరించడంతో సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది.
వడ్డేపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. చిరుత పులి అడుగుజాడలు వెతికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిరుత పులి అడుగుజాడలు కనిపించలేదని, చిరుత పులి సంచరించే ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దన్నారు. రాత్రి సమయంలో రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళవద్దని సూచించారు. వడ్డేపల్లి చుట్టు పక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
చిరుత పులి సంచరించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా వడ్డేపల్లి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ బీట్ సెక్షన్ ఆఫీసర్ ఉస్మాన్ ఉస్తాన్, బీట్ ఆఫీసర్ వేణు జహంగీర్ లు పేర్కొన్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు