Tenth Results | పదో తరగతి (SSC) ఫలితాల్లో ప్రైవేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. తమ ప్రతిభతో ప్రభుత్వ పాఠశాలకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చి గ్రామప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారు.
ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జెడ్పీహెచ్ఎస్ కొండాపూర్ విద్యార్థులు టాప్ ర్యాంకులు తీసుకొచ్చి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఎం. వర్ష 579 మార్కులతో టాప్ 1 ప్లేస్లో నిలిచింది. డి శివానీ-555 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏ లహరి-549, వి అక్షిత -537, ఏ ఆలేఖ్య -536, యు. సృజన్-535, ఎం దివ్య- 534, మరియం ఇమాన్-523, ఎస్నోహ్-511, ఎం మనీష్ శర్మ- 511, కే లక్ష్మణ్-502, ఆర్. సాయిలోకేశ్ 501 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా కొండాపూర్ సర్పంచ్ జిగిరి అమర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.