Farmers | రాయపోల్ 29, నవంబర్ 29 : రైతులు వరి కోతలు కోసిన తర్వాత వాటి కొయ్యలను కాల్చవద్దని గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ బాబు నాయక్ రైతులకు సూచించారు. వరి కొయ్యకాల్లు తగలబెడుతుంటే రైతులకు కొయ్యకాల్లు తగలబెట్టడం వలన కలిగే అనర్థాలను వివరించి వరి కొయ్యకాల్లు తగలబెట్టడాన్ని నిలిపి వేయించారు.
వరి కొయ్యకాల్లను కాల్చటం వలన కలిగే అనర్థాలు..
* తగల బెట్టడం ద్వారా వచ్చే వేడితో భూమిలోని రైతుకు లాభం చేసే సూక్ష్మ జీవులు చనిపోవటం జరుగుతుంది. దీని వల్ల పకృతి సమతుల్యత దెబ్బతిని పంటల దిగుబడి తగ్గుతుంది.
* వరి కొయ్యలు కాల్చటం ద్వారా పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. అదే విధంగా విపరీతమైన వేడి వలన పంటలకు అవసరం అయ్యే పోషకాలు దెబ్బతిని భూ సారం తగ్గి పంటల దిగుబడి తగ్గుతుంది.
వరి కొయ్యలు భూమిలో కలిపి దున్నడం వలన కలిగే ప్రయోజనాలు:
* వరి కొయ్యలు భూమిలో కలిపి దున్నడం ద్వారా సేంద్రీయ కర్బనము పెరిగి దిగుబడి పెరుగుతుంది.
* దుక్కి దున్నే సమయంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయడం ద్వారా వరి అవశేషాలు త్వరగా భూమిలో కలిసి పోషకాలు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా మనం వేసే ఒక డీఏపీలో సగం వరకు తగ్గించవచ్చు.
* కొయ్యలు దున్నటం ద్వారా భూమి గుల్లగా మారి నీటి నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది.
*అదే విధంగా మొక్కలకు 2 శాతం నత్రజని, 4 శాతం భాస్వరం, కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా అంది పంటలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి నరేష్, రైతులు తదితరులు ఉన్నారు.

Dalit Cook: దళిత మహిళను వంట చేయకుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష
Deeksha Divas | తెలంగాణ భవన్లో దీక్షా దివస్.. దీక్షా దివస్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్
Ditwa cyclone | దిత్వా తుఫాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. Video