Dalit Cook: దళిత మహిళను వంట చేయకుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష
Dalit Cook: స్కూల్ పిల్లలకు వంట చేయకుండా దళిత మహిళను అడ్డుకున్న ఆరుగురు వ్యక్తులకు తమిళనాడు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు వాదించారు.
తిరుపుర్: ప్రభుత్వ స్కూల్లో వంట చేయకుండా ఓ దళిత మహిళను అడ్డుకున్న ఆరుగురు గ్రామస్థులకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది తమిళనాడు కోర్టు. 2018లో జరిగిన ఈ ఘటనపై శుక్రవారం స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు కొనసాగింది. పళనిస్వామి గౌండర్, శక్తివేల్, షన్ముగమ్, వెల్లంగిరి, దురైస్వామి, సీతా లక్ష్మీపై కులవివక్ష కేసు కింద శిక్షను ఖరారు చేశారు.
తిరుమలై గౌండమ్‌పాల్యంలో ఉన్న ప్రభుత్వం ఉన్నత పాఠశాలో 44 ఏళ్ల పప్పాల్ కుక్‌గా చేసింది. అయితే శిక్షకు గురైన ఆరుగురు వ్యక్తులు.. విద్యార్థుల పేరెంట్స్. తమ పిల్లలకు అన్నం వండరాదన్న అభిప్రాయాన్ని నిందితులు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పప్పాల్ను వేధించారు. దీంతో తమిళనాడు అస్పృశ్యతా నిర్మూలన ఫ్రంట్ ఆందోళనలు చేపట్టింది. దీని ఆధారంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 35 మందిపై చయ్యూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
శుక్రవారం కోర్టు వాదనల సమయంలోజుడిషియల్ మెజిస్ట్రేట్ ఎం సురేశ్ నిందితులకు రెండేళ్ల జైలుశిక్ష ఖరారు చేశారు. దాంతో పాటు 5 వేల జరిమానా వేశారు. ఆధారాలు లేని కారణంగా 25 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. మరో నలుగురు విచారణ కాలంలో చనిపోయారు.కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఆరుగురిని నిర్బంధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

