Farmers | తొగుట : కేంద్ర ప్రభుత్వం రైతులను సంఘటితం చేసి వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని తొగుట ఎఫ్పీసీ చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. వెంకట్రావుపేటలో ఏర్పాటుచేసిన రైతు సంఘం అభివృద్ధి కోసం రైతులు సహకారం అందించాలని ఆయన కోరారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు విత్తనాలు అందించడం జరుగుతుందన్నారు.
యూరియా కొరత ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం ఎఫ్పీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, మూడు లారీల యూరియా రైతులకు అందించడం జరిగిందని తెలిపారు. రైతులు యూరియా డీఏపీతోపాటు ఇతర ఎరువులు విత్తనాల కోసం మన రైతు సంఘం షాప్లో కొనుగోలు చేయాలని ఆయన కోరారు. రైతు సంఘంలో సభ్యత్వం కోసం రైతులు ముందుకు రావాలని తొగుట మండలంలోని రైతులు రూ.2000 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని ఆయన కోరారు.
యూరియా వాడకం మూలంగా జరిగే నష్టం నివారించడానికి ప్రభుత్వం రాను రాను యూరియా ఉత్పత్తిని తగ్గిస్తారని, నానో యూరియాకు ప్రోత్సాహం అందిస్తారని రైతులు నానో యూరియా డీఏపీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నానో వినియోగం కోసం ఇఫ్కో వారు డ్రోన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.. నానో యూరియా, నానో డీఏపీని రైతులు వరితోపాటు మొక్కజొన్న పత్తి, కూరగాయల పంటలకు పిచికారి చేసుకొని ప్రయోజనం పొందాలని సూచించారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదురుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి