Rythu Bheema | రాయపోల్, ఆగస్టు 10 : కొత్తగా రిజిస్ట్రేషన్ భూములను కొనుగోలు చేసి పాసుబుక్కులు వచ్చినవారు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు సూచించారు. ఆదివారం వ్యవసాయ అధికారి నరేష్ మాట్లాడుతూ.. జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ వచ్చిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చివరి తేది 13 ఆగస్ట్, 2025 లోపు దరఖాస్తు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
1. దరఖాస్తు ఫారం,
2. రైతు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్
3. రైతు ఆధార్ కార్డు జిరాక్స్
4. నామిని ఆధార్ కార్డు జిరాక్స్
పత్రాలను సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 14 ఆగస్టు 1966 నుండి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన ఆధార్ కార్డులో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు మాత్రమే భీమా చేసుకోవాలన్నారు. ఇంతకు ముందు బీమా చేసుకొని ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన వారు 12 ఆగస్టు వరకు ఆయా గ్రామాలకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
రాయపోల్ రైతు వేదికలో రైతు బీమా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని.. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ.. నేరుగా మండల రైతు వేదిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులు సకాలంలో అందించి రైతులు సహకరించాలని పేర్కొన్నారు.
రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ఎంతో ప్రయోజనం చేకూరుతుందని. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు సూచించారు.
Srinuvaitla | బాలకృష్ణతో సినిమాపై స్పందించిన శ్రీనువైట్ల.!
Film Federation | ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల నిరసన