Current loop line | మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), జూన్ 17 : అక్బర్పేట-భూంపల్లి మండలం జంగపల్లి గ్రామ శివారులో ట్రాన్స్ ఫార్మర్ నుంచి సాకలి లక్ష్మీ నర్సయ్య, కర్ల సత్తయ్య, సాకలి ప్రసాద్, గాడి పోచయ్య అనే రైతుల వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా అవుతుంది.
వ్యవసాయ పొలాలకు సరఫరా చేసే విద్యుత్ లూప్‌లైన్ వైర్లు చేతికి అందే విధంగా కిందికి ఉండడంతో అక్కడి రైతులు వరి నాట్లకు దుక్కులు దున్నే సమయం నుంచి నాటు వేసే వరకు భయం భయంతో వరి కోసే సమయంలో కూడా నానా తంటాలు పడి వరి పంటలను కోసుకుంటున్నామని తమ బాధలను వెళ్ల బోస్తున్నారు.
విద్యుత్ అధికారులకు లూప్‌లైన్ వైర్లతో మా రైతులకు ప్రాణాపాయం ఉందని పలు మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ లూప్‌లైన్‌ను సరి చేయాలని కోరుతున్నారు. లేదంటే సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా