కోల్‌కతా: దాదాపు 51 వేల మంది అభిమానుల కోలాహలం మధ్య సాల్ట్‌లేక్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన చరిత్రాత్మక అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత్‌పై ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్ ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో బ్రెజిల్ 4-0తో గెలించింది. అయితే ప్రపంచ సాకర్ పవర్‌హౌజ్ అయిన సాంబా టీమ్‌తో భారత్ ధైర్యంగా పోరాడింది.
మన్వీర్ సింగ్, అనిరుధ్ థాపా, ర్యాన్ విలియమ్స్ తొలి 25 నిమిషాల్లో ప్రతిభ చాటారు. అయితే 28వ నిమిషంలోబ్రెజిల్ ఆటగాడు ఎస్టెవావో భారత డిఫెన్స్‌ను బ్రేక్ చేసి తొలి గోల్ కొట్టాడు. అక్కడి నుంచి సాంబా జట్టు జోరు పెంచింది. పెడ్రో (42వ ని) మరో గోల్ చేయగా.. శామ్యూల్ లినో (58, 90+5వ ని) డబుల్ గోల్‌తో బ్రెజిల్‌కు -0తో ఘన విజయాన్ని అందించాడు. మన్వీర్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు తగిలి రావడంతో భారత్ గోల్స్ ఖాతా తెరవలేకపోయింది.