న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడంతో ప్రీమియమ్ ధరలు తగ్గగా.. ఇన్సూరెన్స్ తీసుకునే మహిళల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. పాలసీ బజార్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ అడాప్షన్ దేశవ్యాప్తంగా 1.5 రెట్లు(150%) పెరగగా, ఇందులో పురుషులతో పోలిస్తే మహిళల కొనుగోళ్లు 27 శాతం వేగంగా వృద్ధి చెండడం విశేషం.
గృహిణుల విభాగంలో 60% వృద్ధిని కనబరిచింది. ఉద్యోగాల్లో కొత్తగా ప్రవేశిస్తున్న 25 ఏండ్ల్లలోపు యువత కొనుగోళ్లు 20%, స్వయం ఉపాధి పొందుతున్న వారి కొనుగోళ్లు 12% వేగంగా పెరిగాయి. తెలుగు రాష్ర్టాలు 39% వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి.