చండీగఢ్: భారత్ చేతిలో వెస్టిండీస్ జట్టు వైట్‌వాష్ తప్పించుకుంది. షై హోప్ (162 నాటౌట్) భారీ శతకంతో విజృంభించడంతో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో 5 వికెట్లతో టీమిండియాను ఓడించింది. ఫలితంగా సిరీస్‌ను స్వీప్ చేయలేకపోయిన భారత్ 2-1తో సరిపెట్టుకుంది.
హోప్ మెరుపులతో భారత్ ఇచ్చిన 352 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జంగూ (67), కీమో పాల్ (44) రాణించారు.తొలుత భారత్ 50 ఓవర్లలో 351/7 చేసింది.కేఎల్ రాహుల్ (129 నాటౌట్) సెంచరీ కొట్టగా..రోహిత్ శర్మ (92), రుతురాజ్ (57) కూడా సత్తా చాటారు. హోప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో తొలి పోరు మంగళవారం లక్నోలో జరుగుతుంది.