రాయపోల్, సెప్టెంబర్ 02: యూరియా (Urea) కోసం రైతులకు ప్రతి రోజు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం ఉదయం నుంచి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో షాపుల వద్ద గంటల తరబడి నిలబడలేక ఓపిక లేక క్యూలైన్లలో చెప్పులు పెట్టారు. వ్యవసాయ అధికారులు మాత్రం లారీ లోడ్ రాగానే రైతులకు టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రెండు లారీలలో యూరియా రావడంతో బస్తా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఇప్పటికైనా రైతులకు సరిపడే యూరియా అందించే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.