సిద్దిపేట : కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులకు ఎరువుల కష్టాలు తప్పడం లేదు. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు పంపిణీ కేంద్రా వద్ద పడిగాపులు కాస్తున్నారు. సరఫరాపై ప్రభుత్వం చేతులెత్తేయడంతో యూరియా కోసం క్యూలో చెప్పులు.. కుస్తీలు పడుతున్నారు. అయినా యూరియ లభించకపోవడంతో ఆందోళనలకు దిగుతున్నారు. ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతుల ముట్టడి
అడ్డుకున్న పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట
క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన… pic.twitter.com/KaL79zK9X0
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2025