Erravelli Survey | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం లోపల అసైన్డ్ భూములు ఉన్నాయని డ్రామాలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కిలోమీటర్ దూరంలో సర్వే చేయించేందుకు రెవెన్యూ అధికారులను పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులను అడ్డుకున్న స్థానిక రైతులు మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి సర్వే చేస్తున్నారు అని వారిని నిలదీశారు.
ఈ నేపథ్యంలో స్థానిక రైతు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మా 325 సర్వే నంబర్ భూములకు, కేసీఆర్‌కు ఈ భూములతో ఇంచు కూడా సంబంధం లేదన్నాడు. ఇక్కడ 1000 ఎకరాల ఫామ్‌హౌస్ ఎక్కడ ఉంటది.. ఉంటే కొలచుకోమని రేవంత్ సర్కార్‌కు సూచించాడు. మా జోలికైతే కేసీఆర్ సార్ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మా భూములు లాక్కపోతా అంటే జమానాలో ఇందిరమ్మ ఇచ్చిన జాగాలను ఎట్లా లాక్కుపోతడు.. మరి మాకు ఎక్కడ చూపిస్తడో చూపియాలి.. భూములను మేమెట్లా ఇస్తం.. ప్రాణం పోయినా మా భూములు మాత్రం ఇవ్వము.. ఆ భూమిలనే ప్రాణం పోతదంటూ హెచ్చరించాడు.
మా 325 సర్వే నంబర్ భూములకు, కేసీఆర్ భూములకు సంబంధం లేదు
మేము దళితులం. ప్రాణం పోయినా మా భూములు మాత్రం ఇవ్వము
– ఎర్రవెల్లిలో దళిత రైతులు https://t.co/rKKY87VeTY pic.twitter.com/Qz8LxV197b
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి 1 కిలోమీటర్ దూరంలో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు
వ్యవసాయ క్షేత్రం లోపల అసైన్డ్ భూములు ఉన్నాయని డ్రామాలు చేసి, ఇప్పుడు కిలోమీటర్ దూరంలో సర్వే చేయిస్తున్న రేవంత్ రెడ్డి https://t.co/szEfkHlxJ7 pic.twitter.com/w1rd3AOsUg
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026