Drinking Water | హుస్నాబాద్ టౌన్, మార్చి 30 : హుస్నాబాద్ పట్టణంలో మంచి నీటి కలుషితం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి గేట్‌వాల్వ్ లీక్ అయి ఇతర నీరు అందులోనుంచి మంచి నీటిపైపు లైన్‌కు వెళుతున్నప్పటికి ఎవరూ పట్టించుకోవడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చార్జ్ కవ్వ వేణుగోపాల్‌రెడ్డి ఆరోపించారు.
స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పట్టించుకోకుండా కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని వేణుగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్