Single Use Plastic | హుస్నాబాద్ టౌన్. జూన్ 17: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను ఎట్టి పరిస్థితిలో వినియోగించవద్దని మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో దుకాణాదారులు, చికెన్ మటన్ వ్యాపారస్తులతో మున్సిపల్ కమిషనర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్ల వినియోగంతో జరుగుతున్న అనర్థాలను వారికి వివరించారు.
చికెన్, మటన్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా తప్పనిసరిగా కేటాయించిన వాహనానికి అందించాలని కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ చెప్పారు. చికెన్ ,మటన్ కొనుగోలుదారులు టిఫిన్ బాక్సులు తమ వెంట తెచ్చుకున్న వారికి కనీసం ఐదు రూపాయలు తగ్గింపుతో అందించాలని వ్యాపారులకు సూచించారు. అలాగే దుకాణాల ముందు టిఫిన్ బాక్సులు తెచ్చుకున్న వారికి ఐదు రూపాయలు సైతం పెట్టాలని కమిషనర్ చెప్పారు.
హుస్నాబాద్ పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుకునేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వ్యాపారం నిర్వహించేవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని.. లేనిచో జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీధర్, బట్టల వ్యాపార సంఘం అధ్యక్షుడు రాజయ్య, మున్సిపల్ ఇంచార్జ్ మేనేజర్ సంపత్ రావు, ఏఈ పృథ్వీరాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి దయ్యాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా