Wargal Temples | వర్గల్, మే18 : వర్గల్ భక్తుల రద్దీతో సందడిగా మారింది. వర్గల్ శ్రీ విద్యాసరస్వతీ ఆలయం, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, నాచగిరి శ్రీలక్ష్మి నృసింహస్వామి ఆలయాలు ఆదివారం ఆయాప్రాంతాలనుండి దేవదర్శనాలకోసం వచ్చిన భక్తులతో సందడిగా మారాయి. నాచగిరి నరసింహస్వామి క్షేత్రంలో భక్తులు పెద్దసంఖ్యలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు.
వర్గల్ శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో నేడు జరిగే విమాన రథోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా వేణుగోపాలస్వామిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వర్గల్ మండల కేంద్రంలో వెలసిన అతిపురాతనమైన శ్రీ వేణుగోపాలస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి రతోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, గీతాజ్ఞానమండలి సభ్యులు ఇప్పటికే తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు దేవతామూర్తులు పురవీధులలో వాహనసేవలో ఊరేగుతున్నారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్