MLA Kotha Prabhakar Reddy | మల్లన్న సాగర్ ఉప కాల్వల నిర్మాణపనులు వేగవంతంగా చేపట్టాలి : ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా నిర్మించతలపెట్టిన పలు ఉప కాల్వల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ని కోరారు.
దుబ్బాక : దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు (Mallannasagar project) ద్వారా నిర్మించతలపెట్టిన పలు ఉప కాల్వల (Sub-canals) నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి( MLA Kotha Prabhakar Reddy) నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) ని కోరారు. మంగళవారం సెక్రటేరియట్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు.
కాళేశ్వరం(Kaleshwaram,) , రంగనాయక సాగర్ (Ranaganayaka Sagar) ల నుంచి దుబ్బాక నియోజకవర్గం రైతులకు సాగునీరందించేందుకు కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. రామయంపేట. చేగుంట, దుబ్బాక మండలాల్లో పలు చోట్ల ఉప కాల్వల నిర్మాణ పనులు నిలిచిపోయాయని వివరించారు.
నియోజకవర్గంలో సుమారు లక్షా 30 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రధాన కాల్వల నుంచి ఉప కాల్వల నిర్మించాల్సి ఉందని వెల్లడించారు. మల్లన్నసాగర్‌తో అన్ని గ్రామాలకు సాగునీరు సరఫరా చేసి, రైతుల సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

